త్వరలో ఫోన్ నెంబర్లు బ్లాక్ అవుతాయంటూ కాల్స్... ట్రాయ్ స్పందన

22-08-2024 Thu 19:23 | National
Advertisement
  • గుర్తుతెలియని వ్యక్తుల కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ట్రాయ్
  • ట్రాయ్ పేరిట వస్తున్నవి ఫేక్ కాల్స్ అని వెల్లడి
  • నెంబరు బ్లాక్ చేసేది సిమ్ కంపెనీలు అని స్పష్టీకరణ
  • బిల్లింగ్, కేవైసీ చేయించుకోకపోతే నెంబరు బ్లాక్ చేస్తుంటారని వివరణ
Advertisement
ఇటీవల కాలంలో మోసపూరిత, బెదిరింపు ఫోన్ కాల్స్ బెడద ఎక్కువైన నేపథ్యంలో, ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) స్పందించింది. ఈ తరహా అవాంఛనీయ కాల్స్ పై ట్రాయ్ వినియోగదారులకు సూచనలు చేసింది. 

ట్రాయ్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. త్వరలో ఫోన్ నెంబర్లు బ్లాక్ అవుతాయంటూ వస్తున్న కాల్స్ ను నమ్మవద్దని తెలిపింది. ఫోన్ నెంబరు డిస్ కనెక్ట్ చేస్తామంటూ వచ్చే కాల్స్, సందేశాలు ఫేక్ అని ట్రాయ్ స్పష్టం చేసింది. 

ఫేక్ కాల్స్ చేస్తున్న వ్యక్తులు ట్రాయ్ పేరిట వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. మొబైల్ వినియోగదారులకు తాము ఇలాంటి కాల్స్ చేయడంలేదని, మెసేజ్ లు కూడా పంపడంలేదని ట్రాయ్ వివరణ ఇచ్చింది. ప్రజలు మోసగాళ్ల బారినపడి నష్టపోవద్దని సూచించింది. 

మొబైల్ కనెక్షన్ల రద్దుతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నెంబర్లు బ్లాక్ చేసేందుకు తాము ఏ థర్డ్ పార్టీ ఏజెన్సీకి అధికారం ఇవ్వలేదని తేల్చి చెప్పింది. 

టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల (సిమ్ కంపెనీలు) ద్వారానే నెంబరు బ్లాక్ అవుతుందన్న విషయాన్ని వినియోగదారులు గుర్తించాలని ట్రాయ్ సూచించింది. బిల్లింగ్, కేవైసీ వంటి కారణాలతో ఫోన్ నెంబర్లను టెలికాం ఆపరేటర్లు డిస్ కనెక్ట్ చేస్తారని వివరించింది. 

అనుమానిత కాల్స్ పై sancharsaathi.gov.in/sfc/ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని ట్రాయ్ పేర్కొంది. సైబర్ క్రైమ్ బాధితులు 1930 హెల్ప్ లైన్ నెంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. cybercrime.gov.in వెబ్ సైట్ లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
Advertisement
TRAIFake CallsNumber BlockingMobile Users

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more